వరుణ్‌ ప్రపోజ్ చేస్తే….. చెప్పు చూపించింది

356
Varun Tej About his Love proposal
- Advertisement -

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓ మోస్తారు హైప్‌తో వచ్చిన ఈ మూవీ అంచనాలకు మించి రెస్పాన్స్‌ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని చోట్ల హిట్‌ టాక్‌తో యూత్,ఫ్యామిలీ,క్లాస్,మాస్ అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నిర్మాత దిల్ రాజు సినిమా కలెక్షన్లు చూసి ఫిదా అయిపోతున్నాడట.

సినిమా హిట్టైన సందర్భంగా  ఫిదా చిత్రంలోని ఓ సన్నివేశాన్ని గుర్తుచేస్తూ వరుణ్ తేజ్ ఓ ట్వీట్ తో పాటు ఓ చెప్పు ఫొటోను పోస్ట్ చేశాడు. ‘వరుణ్ తేజ్ క్రేజీగా ఫీలయ్యేలా భానుమతి ఇచ్చిన రిప్లై ఇదే’ నంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఈ చిత్రంలో సాయిపల్లవికి వరుణ్ తేజ్ తన లవ్ ను ప్రపోజ్ చేస్తే.. చెప్పు ఫొటోను మెస్సేజ్ రూపంలో పంపి సాయిపల్లవి రిప్లై ఇస్తుంది. ఈ సీన్ కు థియేటర్ లో ప్రేక్షకుల చప్పట్లతో మార్మోగిపోయిందని అభిమానులు చెబుతున్నారు. ఇకపై, లవ్ ప్రపోజ్ చేస్తే ‘చెప్పు’ ఫొటో ద్వారానే రిప్లైలు పంపిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు షేర్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. అప్పట్లో ఖుషీ, ఇప్పట్లో ఫిదా, ‘ఫిదా అయిపోయాం అన్న. లవ్ యూ అన్నా..’ అంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

- Advertisement -