యూత్‌స్టార్‌తో పవర్‌స్టార్‌..

191
Nithin's next film to be produced by Pawan Kalyan
- Advertisement -

యూత్‌స్టార్‌ నితిన్ హీరోగా పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ ఒక చిత్రం నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఈ సంబందించిన షూటింగ్ నేడు ప్రారంభమైంది. నితిన్‌కు చెందిన నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ తో కలసి క్రియేటివ్ వర్క్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. స్క్రీన్ ప్లే, డైలాగులను అందించడమే కాకుండా డైరెక్షన్ కూడా కృష్ణ చైతన్య చేస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Nithin's next film to be produced by Pawan Kalyan

ఈ మూవీ 50 రోజుల పాటు హైదరాబాద్ లో నిర్విరామంగా షూటింగ్ జరగబోతోంది. తర్వాత మరో షెడ్యూల్ కోసం ఈ చిత్ర యూనిట్ అమెరికాకు వెళ్లబోతోంది. నితిన్ ఈ మధ్యే ‘లై’ సినిమాను పూర్తి చేసి ఫ్రీ అయ్యాడు. దర్శకుడిగా తొలి సినిమా ‘రౌడీ ఫెలో’తో మంచి పేరు సంపాదించిన కృష్ణచైతన్య రెండో సినిమా కోసం చాలా కాలమే ఎదురు చూశాడు. నితిన్ తోనే సినిమా తీయాలని ఫిక్సయి అతను ఫ్రీ అయ్యే వరకు వెయిట్ చేశాడు. ఈ కాంబినేషనే జనాల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథను అందించడం కూడా కావడం వివేషం. ఈ సినిమాలో నితిన్ తో పాటు మేఘా ఆకాశ్, రావు రమేష్, నరేష్, ప్రగతి, లిజీ, నర్రా శ్రీను, శ్రీనివాసరెడ్డి, మధు తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -