పాన్ ఇండియన్‌ సినిమాలో వరుణ్‌!

55
varun sandesh
- Advertisement -

కొంతకాలంగా సినిమాలకు దూరమైన హీరో వరుణ్ తేజ్ బంపర్ ఛాన్స్ కొట్టేశారు. సందీప్ కిషన్‌- విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా మైఖెల్‌లో నటించే ఛాన్స్‌ కొట్టేశారు. ఈ సినిమాలో వరుణ్ కీలక పాత్ర పోషించనున్నారని మేకర్స్ ప్రకటించారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త షెడ్యూల్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్‌గా నటిస్తుండగా, సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది.

- Advertisement -