సతీసమేతంగా బిగ్‌బాస్‌లోకి..ఆ కపుల్ ఎవరో తెలుసా..!

536
nagarjuna big boss 3
- Advertisement -

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 3 మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానుంది. జూలై 21 నుంచి బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కానుండగా హోస్ట్‌గా మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కింగ్ నాగార్జున హోస్ట్‌ గా వ్యవహరించనున్నారు.ఇక బిగ్ బాస్3లో కామన్ మ్యాన్‌ ఎవరు ఉండరు అంతా సెలబ్రెటీలే ఉండనున్నారు.

ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌లు ఎవరా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హేమచంద్ర, ఉప్పల్ బాలు, ఉదయభాను, శ్రీముఖి, తీన్మార్ సావిత్రి ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు హీరో వరుణ్ సందేశ్ ఆయన భార్య వితికా పేర్లు వినిపిస్తున్నాయి.

Image result for varun sandesh wife pics

హ్యాపీడేస్‌తో పరిచయమైన వరుణ్ సందేశ్ దాదాపు 20 సినిమాల్లో చేశారు. 2015లో వితిక షెరును వివాహం చేసుకున్న వరుణ్ ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి సతీసమేతంగా ఎంటరవుతున్నారన్న వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

- Advertisement -