యష్‌కు థ్యాంక్స్ చెప్పిన వరుణ్!

7
- Advertisement -

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ (Toxic) సినిమా మరోసారి వాయిదా పడటంతో, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ విడుదల తేదీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సినిమాను మళ్ళీ పాత తేదీ అయిన జూన్ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా, ఈ అవకాశం కల్పించినందుకు యశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

మొదట ‘టాక్సిక్’ జూన్ 2025లో విడుదల కావాల్సి ఉండటంతో, బాక్సాఫీస్ వద్ద పోటీని నివారించేందుకు వరుణ్ ధావన్ తన సినిమాను వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు ‘టాక్సిక్’ పోస్ట్‌పోన్ కావడంతో, వరుణ్ తన సినిమాను తిరిగి జూన్ 5కే ఫిక్స్ చేశారు.

యశ్ మరియు ‘టాక్సిక్’ బృందంతో తనకు ఉన్న మంచి సంబంధాల గురించి వరుణ్ ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియా ద్వారా వారికి థాంక్స్ చెప్పారు. మాకు క్లియర్ విండో (పోటీ లేని సమయం) లభించేలా చేసినందుకు ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. హై జవానీ తో ఇష్క్ హోనా హై చిత్రానికి వరుణ్ తండ్రి, సీనియర్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ మరియు పూజా హెగ్డే నటిస్తున్నారు.

Also Read:ఏపీ కేబినెట్ భేటీ..కొత్త పెన్షన్లపై చర్చ

- Advertisement -