కరణ్ పార్టీలో సాహో హంగామా

230
Varun Dhawan stabs Prabhas
- Advertisement -

బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరో ప్రభాస్. భారతదేశ చలనచిత్ర రికార్డులను తిరగరాసిన బాహుబలి ఇందులో నటించిన వారికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ ఉత్తరాదివారిని సైతం తననటనతో ఇంప్రెస్ చేసేశాడు. బాహుబలి తర్వాత సాహోలో నటిస్తున్న ప్రభాస్ షూటింగ్ గ్యాప్‌లో హాలీడే ట్రిప్‌ను తెగ ఎంజాయ్ చేశాడు. ఈ నేపథ్యంలో భారత్‌కు తిరిగివచ్చిన యంగ్ రెబల్ స్టార్ కోసం బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్ నిన్న రాత్రి ముంబైలో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.

 Varun Dhawan stabs Prabhas
ఈ పార్టీకి రానాతో పాటు, బాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్లు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్ తో బాలీవుడ్ నటులంతా చాలా సరదాగా కలసిపోయి, ఎంజాయ్ చేశారు. ఈ పార్టీకి హాజ‌రైన ప్ర‌భాస్.. వ‌రుణ్‌ ధావన్ తో కలిసి స‌ర‌దాగా సంద‌డి చేశాడు. ఈ క్ర‌మంలో ఓ ఫోటోని తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు వ‌రుణ్ . బాహుబలి లో కట్టప్ప ప్రభాస్ ని వెన్ను పోటు పొడిచినట్టుగా, వరుణ్‌ కూడా ప్రభాస్ ని వెన్ను పోటు పొడిచినట్టు ఓ ఫోటోకి స్టిల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాకి సన్నద్ధం అవుతుంటే , వరుణ్‌ ధావన్ జుడ్వా 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. అంతేగాదు ప్ర‌భాస్ ని ప‌లువురు సెల‌బ్రిటీలు ప్ర‌శంసించ‌డంతో పాటు, ఆయ‌న త‌దుపరి చిత్రం సాహో కోసం ఎదురు చూస్తున్నామ‌ని చెప్పార‌ట

 Varun Dhawan stabs Prabhas
కొద్ది రోజుల క్రితం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది కొన్ని లక్షలాది సినీ ప్రేక్షకుల మనసులలో అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఏప్రిల్ 28న రాజమౌళి దీనికి సమాధానం ఇచ్చి ఆడియన్స్ కి కాస్త రిలీఫ్‌ ఇచ్చాడు. అయితే బాహుబలి2 సినిమా విడుదలై 50 రోజులు పూర్తైనప్పటికి ఈ సినిమా మానియా ఇంకా కొనసాగుతూనే ఉంది.  బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారింది. ఇటు టాలీవుడ్ , అటు బాలీవుడ్ స్టార్స్ తో ప్రభాస్ మంచి రిలేష‌న్ షిప్ మెయింటైన్ చేస్తున్నాడు.

 Varun Dhawan stabs Prabhas

 Varun Dhawan stabs Prabhas

- Advertisement -