బాహుబలిపై వర్మ మరో ట్వీట్..

166
Varma tweets on Baahubali
- Advertisement -

బాహుబలి ది కన్ క్లూజన్ విడుదలకు దగ్గర పడుతున్న కొద్ది ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. సెలబ్రెటీల దగ్గరి నుంచి ప్రతి ఒక్కరు సినిమా చూసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బాహుబలికి సంబంధించి ఏ చిన్న వార్తైన సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. తాజాగా దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్విట్ వైరల్‌గా మారింది. బాహుబలి-2వ భాగం విడుదలైన తరువాత, దేశంలోని చిత్ర నిర్మాతలు, దర్శకులందరూ తామంతా టీవీ సీరియల్ నిర్మాతలము, దర్శకులమేనని భావించాల్సి వస్తుందని అన్నాడు. ఈ విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పాడు. ఉదయం 9:45 గంటల సమయంలో రాంగోపాల్ వర్మ ఈ ట్వీట్ పెట్టగా, అది నిమిషాల్లోనే ట్రెండైంది.

అయితే వర్మ బాహుబలికి సంబంధించి ట్విట్ చేయగా దానికి జక్కన్న కూడా సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. రాజమౌళి, తాను కలసి ఉన్న ఓ ఫొటోను వర్మ తన ట్విట్టర్లో అప్ లోడ్ చేసి దానికి  ‘బ్యూటీ అండ్ అగ్లీ’ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. అంతటితో ఆగకుండా.. తాను అగ్లీగా ఉన్నానని, రాజమౌళి మాత్రం అందంగా ఉన్నాడని మరో ట్వీట్ పెట్టాడు. బాహుబలి కంటే  కూడా జక్కన్న చాలా సెక్సీగా ఉన్నాడంటూ కితాబిచ్చాడు వర్మ. దీంతో వర్మను భరించలేని జక్కన్న ‘అయ్యా నన్ను ఒగ్గేయండయ్యా’ అంటూ వేడుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -