జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ మీద ఎక్స్ పెక్టేషన్స్ తో మాట్లాడాను గానీ తను చేసుకున్న మూడు పెళ్ళిళ్ళు లాంటి పర్సనల్ విషయాలను నేనెప్పుడు మాట్లాడలేదని చురకలంటించారు. నా జీవితం నా లైఫ్ స్టైల్ నేను ఆలోచించే విధానం దాచుకోకుండా, దాక్కోకుండా నా పుస్తకం నా ఇష్టం లో మెత్తం విప్పి రాసాను అని ట్వీట్ చేశారు.
వాళ్లింట్లో వాళ్ళ గురించి మాట్లాడారని యండమూరిని తిట్టారు . మరి వాళ్ళు వేరే వాళ్ళ గురించి మాట్లాడొచ్చా? ఇదేనా వికాసం.. నేను తన మీద ఇష్టంతో నిజాయితీగా మాట్లాడాను గాని క్రిటిసైజ్ చేయడానికి కాదని తను తెలుసుకోలేకపోవటం నా దురదృష్టం.. ఇక చివరిగా పవన్ కి అతని భార్యకు, పిల్లలకు, ఫ్యామిలీకి, జనసేన పార్టీకి మరియు పవన్ ఫ్యాన్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి ’ వరుస ట్వీట్ల కి పులిస్టాప్ పెట్టాడు రాము. మరి దీనిపై పవన్, ఆయన అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.
అంతకుముందు ఏపీ ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండట్టిన పవన్ …. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్ధాయిలో ద్వజమెత్తారు. వెంకయ్యకు స్వర్ణభారతి ట్రస్ట్ మీద ఉన్న ప్రేమ ఏపీకి ప్రత్యేక హోదా తెవడంపై లేదని చురకలంటించారు. పనిలో పనిగా దర్శకుడు ఆర్జీవీపై సైతం పవన్ మండిపడ్డారు. రాంగోపాల్ వర్మకు ప్రస్తుతం ఓ 50 ఏళ్లు ఉంటాయనుకుంటా. ఆయనకు ఓ పెళ్లైన కూతురు కూడా ఉంది. కానీ పోర్న్ సినిమాలు చూస్తానని చెప్పుకునే ఆయన గురించి నేనేం మాట్లాడనని పవన్ వ్యాఖ్యానించారు. పవన్ మాట్లాడిన కొద్దిసేపటికే వర్మ ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
Oka abhimanigaa PK meedha expectationstho maatlaadanu gaani thanu chesukunna 3 pellilla laanti personal vishayalu neneppudoo maatladaledhu
— Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2017