వివాదాస్పద సంఘటనలు, గ్యాంగ్‌స్టర్ల జీవిత చరిత్రలను వెండితెరపై చూపించడంలో రాంగోపాల్ వర్మ స్టైలే వేరు. రక్తచరిత్ర,సర్కార్, వీరప్పన్, వంగవీటి తెరకెక్కించిన వర్మ త్వరలో గ్యాంగ్ స్టర్ నయీం బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఇంకా కార్యరూపం దాల్చకుండానే త్వరలో మరో సంచలన చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నాడట.
అత్యాచార కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ సింగ్‌పై బయోపిక్ తీసేందుకు వర్మ సన్నాహాలు చేస్తున్నాడట. ఈ కేసులో గుర్మీత్‌కు సీబీఐ కోర్టు రెండు కేసుల్లో ఇరవై ఏళ్ల జైలు శిక్ష, రూ.30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్‌గా మారడం, ఆయన అనుచరులు వేల కోట్ల ఆస్తి నష్టం చేసిన నేపథ్యంలో గుర్మీత్‌కు సంబంధించిన విషయాలపై ఆర్జీవీ ఆరా తీస్తున్నాడట. గుర్మీత్‌కు సంబంధించి డేరా ఆశ్రమంలో జరిగే చీకటి పనులతో పాటు ఆయన గురించి తెలియని విషయాలను భయటపెట్టనున్నాడట. ఇందులో తప్పులే కాకుండా మంచి విషయాలను కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది.ఈ విషయత్వరలో ఈ విషయమై వర్మ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
డేరా బాబా కామ దాహానికి నలిగిపోయిన యువతుల క్యారెక్టర్‌లతో పాటు పితాజీ మాఫీ అనే పేదం వెనుక ఉన్న అసలు విషయాన్ని బయటపెట్టనున్నాడట. బాబా ఆశ్రమంలో 90 శాతం మహిళలు డేరా బాబా కామ దాహానికి బలైనవారేనన్న వార్తలు వస్తుండటంతో వర్మ తెరకెక్కించబోయే సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.