రౌడీ…రాయుడు..!

261
Rowdy Rayudu Ambati
- Advertisement -

భారత క్రికెటర్ అంబటి రాయుడు వివాదంలో చిక్కుకున్నాడు.  రాష్ డ్రైవింగ్ చేయ‌డ‌మే కాకుండా న‌డి రోడ్డుపైనే సీనియ‌ర్ సిటిజ‌న్‌పై చేయి చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు రాయుడు తీరు వివాదాస్పదంగా మారింది.

సికింద్రాబాద్ హబ్సీగూడలో నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో కొంతమంది సీనియర్ సిటిజన్లు డైలీ వాకింగ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో  రాష్ డ్రైవింగ్‌తో దూసుకువచ్చిన రాయుడు కారు ఓ సీనియర్ సిటిజన్‌కు తాకింది. ఇదేంటీ అని ప్రశ్నించిన సిటిజన్‌పై బండ భూతులు తిడుతూ చేయిచేసుకున్నాడు. తిరిగి రెండోసారి కూడా రాయుడు చేయి చేసుకోవడంతో గొడవ పెద్దదవుతుందని భావించిన రాయుడి స్నేహితుడు అక్కడినుంచి అతన్ని పంపించేశాడు.

అంతేగాదు ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోవాలని హెచ్చరించాడు.  క్రికెటర్‌గా మంచి పేరున్న రాయుడు ఈ విధంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయుడు ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదని గతంలో కూడా ఇలాగే చేశాడని కొంతమంది స్ధానికులు చెబుతున్నారు. ప్రస్తుతం రాయుడు సిటిజన్‌ పై చేయిచేసుకుంటున్న వీడియోని  ఫోన్‌లో చిత్రికరించిన ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో  వైరల్‌గా మారింది.

https://youtu.be/o5yoqDBg674

- Advertisement -