రామ్‌పూరి=బోల్డ్ బ్యూటీ..

259
varma and puri bold web serieses
- Advertisement -

మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్.. ఇప్పుడంతా ఫేస్ టు ఫేస్. చెప్పాలనుకున్నది చెప్పేయడమే..చూపించాల్సింది మొత్తం చూపించేయడమే.

ఇదే ఇప్పుడు ఫాలో అవుతున్నారు రామ్ పూరి లు. గురువుకు తగ్గ శిష్యుడిలా.. రామ్ గోపాల్ వర్మ బోల్డ్ చూపిస్తుంటే.. పూరి బోల్డ్ తో పాటు బ్యూటీ ని కూడా చూపిస్తున్నాడు. వీరిద్దరూ చూపిస్తున్న బోల్డ్ అండ్ బ్యూటీ కి షల్టర్ ఇచ్చేది మాత్రం యూట్యూబ్. ఇక్కడ సెన్సార్లులేవ్…ఓన్లీ సెన్సేషన్సే.

అందుకే వెబ్ సిరీస్ ను స్టార్ట్‌ చేస్తున్నామంటూ..ఒకరు కత్తులు నూరుతుంటే..ఇంకొకరు ‘హగ్‌’ చేసుకుంటున్నారు. అయితే వీటికి సంబంధించిన వీడియో, ఫొటో, సోషల్‌ మీడియాలో కనిపించడంతో ఒక్కసారిగా స్టన్‌ అయ్యారు నెటిజన్స్‌. బోల్డ్‌ ని చూపించడం వర్మకి కొత్తేం కాదు. ‘కడప’కు ముందే ‘గన్స్‌ అండ్‌ థైస్‌’ తో బోల్డ్‌ను చూపించిన వర్మ ‘కడప’లో బోల్డ్‌ టాక్‌ ని కూడా వినిపించాడు.

ఇక వర్మ సంగతి పక్కన పెడితే..’హగ్‌’ పేరుతో అందమైన ప్రకృతిలో ఉన్న ఓ న్యూడ్‌ పిక్‌ ని ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు పూరీ జగన్నాథ్‌. ఇదేంటనే ప్రశ్న రాకుండానే ‘హగ్‌’ తో వెబ్‌సిరీస్‌ అనేశాడు. అయితే.. ఈ వెబ్‌ సిరీస్‌లను మన డైరెక్టర్లు ఎలా రన్‌ చేస్తారో తెలీదుగానీ..ఆలోచిస్తే ఇలా కూడా చెయ్యొచ్చంటూ కొత్త దారిని చూపిస్తున్నారు.

ఇక ఇదంతా పక్కన పెడితే..వర్మ ‘కడప’ సిరీస్‌ సీరియస్‌ అవుతోంటే…పూరీ ‘హగ్‌’ మాత్రం హీట్‌ పుట్టిస్తోంది. మొత్తానికి బోల్డ్‌+బ్యూటీ తో రామ్‌పూరి లు రెచ్చిపోతున్నారనే చెప్పాలి.

- Advertisement -