కామ్‌గా కానిస్తున్న వర్మ..

87
varma and nag movie second schedule shooting starts in gachchibowli

వర్మ చాలా సైలెంట్‌ గా ఉంటాడు. సోషల్‌ మీడియాలో కాదు. సినిమా నిర్మాణంలో. తన దృష్టికొచ్చే ప్రతీ అంశంపై ట్విట్టర్‌లో,ఫేస్‌బుక్‌లో తెగ హంగామా చేసే వర్మ, సినిమా నిర్మాణంలో మాత్రం సైలెంట్ గానే అన్నీ కానిచ్చేస్తుంటాడు. ఎప్పుడు ప్లాన్ చేస్తాడో తెలియదు, ఎప్పుడు తీస్తాడో తెలియదు. కానీ సినిమా మాత్రం రెడీ అయిపోతుంది. ఇప్పుడు తాజగా నాగార్జున హీరోగా చేస్తున్న సినిమాను కూడా అలాగే సైలెంట్ గా షూట్ చేసేస్తున్నట్లు తెలుస్తోంది.

varma and nag movie second schedule shooting starts in gachchibowli

నాగ్ హీరోగా ఆర్జీవీ సినిమా స్టార్ట్ అయిన తరువాత ఓ షెడ్యూలు ముగిసింది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ హైదరాబాద్ – గచ్చిబౌలిలో జరుగుతోంది. నాగ్ తో పాటు ఇతర ముఖ్య పాత్రధారులు షూటింగులో పాల్గొంటున్నట్టుగా సమాచారం. పోలీస్ ఆఫీసర్ గా నాగార్జున చేస్తుండటం ఒక విశేషమైతే, ఆయన సిక్స్ ప్యాక్ లో కనిపించనుండటం మరో విశేషం.

 varma and nag movie second schedule shooting starts in gachchibowli

గతంలో నాగ్ .. వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘శివ’ ఏ స్థాయిలో సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ తరువాత ఈ ఇద్దరూ కలిసి ‘అంతం’ .. ‘గోవిందా గోవిందా’ చేసినా, అవి ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్‌ ను ఆకట్టుకోలేకపోయాయి.

తాజా చిత్రం మాత్రం ‘శివ’ను మించి వుంటుందని వర్మ చెబుతుండటం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. కాగా..మైరా సరీన్ హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమవుతోన్న ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.