వెరైటీ.. గణపయ్య!

4
- Advertisement -

వినాయక చవితి వచ్చేసింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రతిచోటా వినాయక చవితి సందడి కనిపిస్తోంది. ఇక మార్కెట్‌లో వివిధ రకాల వినాయక ప్రతిమలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి.

ప్రధానంగా వెరైటీ వినాయక ప్రతిమలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. అనంతపురం జిల్లా పామిడిలో తయారుచేసిన విఘ్నేశ్వరుడి విగ్రహం అందర్నీ ఆకట్టుకుంటోంది. కాస్త భిన్నంగా సబ్బులు, శాంపూలతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. సంతూర్, సింతాల్, లక్స్ సబ్బులతో పాటు శాంపూలు, కంఫర్ట్ ప్యాకెట్లను వినియోగించారు. సుమారు 25,000 ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు.

వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు సెయింట్ ఆంటోనీ పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా విద్యార్థులు గణేశుడి ఆకృతిని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాళ్లలోని శ్రీరామనగరం విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినాయక చవితిని విభిన్న రీతిలో జరుపుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. నాలుగు వేల మంది విద్యార్థులు గణేశుడి ఆకృతిని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.. ఐదు వేల దీపాలను వెలిగించి అద్భుత ప్రదర్శనను నిర్వహించారు.

Also Read:ఆర్చరీలో తెలంగాణ బిడ్డ..స్వర్ణ పతకం

గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డులో కొలువుదీరనుంది 99 అడుగుల మట్టి గణేశుడి విగ్రహం. ఎకో గణేష్ పేరుతో పర్యావరణ అనుకూలమైన పదార్థాలతో గణేష్ విగ్రహాన్ని తయారు చేశారు నిర్వాహకులు. ఇక అందరి దృష్టిని ఆకర్షించే ఖైరతాబాద్ గణేశుడు ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నారు. ఒకవైపు పూరీ జగన్నాథుడు.. మరోవైపు లక్ష్మీ హయగ్రీవ స్వామి ఉండగా ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో కొలువుదీరాడు గణపయ్య.

- Advertisement -