ఆర్చరీలో తెలంగాణ బిడ్డ..స్వర్ణ పతకం

5
- Advertisement -

ఆర్చరీలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది తెలంగాణ బిడ్డ. ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్స్ 2025లో అండర్-21 మహిళల కాంపౌండ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలంగాణకు చెందిన తానిపర్తి చికితను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా అభినందించారు.

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల చికిత, కెనడాలోని విన్నిపెగ్‌లో శనివారం జరిగిన టోర్నమెంట్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఆర్చర్‌గా నిలిచింది.

ఆమె అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్‌లో స్పెయిన్‌కు చెందిన పౌలా డయాజ్ మొరిల్లాస్‌ను 142-133, ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన పార్క్ యెరిన్‌ను 142-136 స్కోరుతో ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

Also Read:కన్యా కుమారి.. బ్యూటీఫుల్ మూవీ!

- Advertisement -