త్వరలో రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేసింది తమిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్. పందెంకోడి 2, సర్కార్ సినిమాల్లో నటించిన వరలక్ష్మీ…ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తమిళ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్లే తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణమని తెలిపారు.
పందెం కోడి 2, సర్కార్ సినిమాలకు తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. పాత్ర తాలూకు ఎమోషన్స్ నటీనటులకే ఎక్కువ తెలుస్తాయి కాబట్టి మనది మనమే చెప్పుకుంటే ఇంకా పాత్రకు డెప్త్ వస్తుందని నమ్మకమని తెలిపింది. ఆర్టిస్ట్ అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి… అందుకే హీరోయిన్, సెకండ్ హీరోయిన్, విలన్, గెస్ట్ రోల్స్ అనే తేడా చూడను. బహుశా అందుకేనేమో ఈ ఏడాది ఆల్రెడీ 4 సినిమాలు రిలీజయ్యాయి. మరో మూడు రిలీజ్ కాబోతున్నాయని తెలిపారు.
నాన్న (శరత్ కుమార్) పేరు వాడటం తనకు ఇష్టం ఉండదని… సొంతంగా ఎదగాలనే ఫిలాసఫీ నాదని తెలిపారు. ‘మీటూ’ ఉద్యమం స్టార్ట్ అవ్వకముందే క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడానని… స్త్రీల పట్ల తప్పుగా ప్రవర్తించిన వారి పేరు బయటపెట్టి, పరువు తీయడం. అలా చేస్తే భవిష్యత్తులో మరొకరు ఆ తప్పు చేయడానికి భయపడతారని తెలిపారు.
ప్రశ్నించే అలవాటు చిన్నప్పటి నుంచే అలవడిందని…. తప్పు ఎవరిదైతే వాళ్ల వైపు వేలు ఎత్తి చూపించడానికి భయపడనని చెప్పారు. ప్రస్తుతం వరలక్ష్మీ నటించిన ‘సర్కార్’ నవంబర్ 6న విడుదల కానుంది.