వరహ రూపం పాటకు లైన్ క్లియర్‌

197
- Advertisement -

భారత సినిమా ఇండస్ట్రీని ఒక చూపు చూసిన కాంతార మూవీ. తాజాగా మరోసారి వార్తలో నిలిచింది. అయితే ఈ సారి వరహ రూపం పాట కోసం వచ్చింది. కేవలం 16కోట్లతో తెరకెక్కిన ఈసినిమా ఇప్పటివరకూ రూ.450కోట్లను కలెక్ట్‌ చేసి…బాక్సాఫీస్ వద్ద చరిత్ర రికార్డు సృష్టించింది. రిషబ్‌శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అదరగోడుతుంది. అయితే తాజాగా కోజికడ్‌ కోర్టు వరహ రూపం పాటను వాడుకోవచ్చని తీర్పునిచ్చింది.

భూతకోల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా భావించే వరాహరూపం పాటను ఇకపై ప్రదర్శించడకూడదని కేరళలోని కోజికోడ్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు ఆదేశించింది. థాయికుడమ్‌ బ్రిడ్జ్‌ వారు రూపొందించిన నవరసం అనే ఆల్బమ్‌కు కాపీగా వరాహరూపం తీర్చిదిద్దారని పేర్కొంటూ ఈ తీర్పును వెలువరించింది. తాజాగా కోజికడ్ ఈ తీర్పును కొట్టివేస్తూ కాంతార టీంకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాంతో కాంతార అభిమానులు ఈ పాటను ఓటీటీలో యాడ్ చేస్తారా లేదా ఏంతో అతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ దానికి కొంత సమయం పట్టచ్చని శాండల్‌వుడ్ సమాచారం. ఇందులో సప్తమి గౌడ కిషోర్ తదితరులు నటించారు. ఈ సినిమాను హోంబలే ఫిల్స్మ్‌ వారు నిర్మించారు.

ఇవి కూడా చదవండి…

నేను బాలీవుడ్ కి ఎందుకు వెళ్ళాలి ? వెళ్లను !

యంగ్ డైరెక్టర్ పై లెజెండరీ దర్శకుడు ప్రశంసలు !

మట్టి కుస్తీ మాస్ కమర్షియల్:విష్ణువిశాల్

- Advertisement -