ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీ లక్ష్మీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు. పిటిషన్‌పై తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఓఎంసీ కేసు నుంచి తన పేరు తొలగించాలని శ్రీలక్ష్మీ క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది.
ఓఎంసీకి గనుల కేటాయింపులో శ్రీలక్ష్మి పాత్రలేదని ఆమె తరపు న్యాయవాది వాదించారు. అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ కోర్టు నిర్దోషిగా తేల్చిందన్నారు న్యాయవాది. గనులాశాఖ కార్యదర్శి కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషిగా తేల్చిందని చెప్పారు.
Also Read:అమరావతికి విశాఖ డ్రగ్స్ కేసు
శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో ఆధారాలు లేవని తెలిపారు. ఓఎంసీకి మైనింగ్ అనుమతుల్లో శ్రీలక్ష్మీ హస్తముందని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. శ్రీలక్ష్మీ ప్రమేయంపై తగిన ఆధారాలున్నాయని.. ఓఎంసీకి గనుల కేటాయింపులో శ్రీలక్ష్మీ చొరవ తీసుకున్నాని సీబీఐ పీపీ వాదించారు. పిటిషన్‍పై తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

