పాత వీడియో..తప్పు ఒప్పుకున్నా:వంటేరు

4
- Advertisement -

ఆ రోజుల్లో రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, వాస్తవాలు కాకపోయినా నేను హరీష్ రావు మీద విమర్శలు చేశాను అన్నారు బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి. ఆ విమర్శలు అవాస్తవం.. నాది తప్పు అని కూడా అప్పుడే ఒప్పుకున్నాను అన్నారు.

కొందరు దద్దమ్మలు ఆ పాత వీడియోలను ఇప్పుడు తిప్పుతున్నారు.. ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తాం అని హెచ్చరించారు వంటేరు. అప్పుడు మల్లన్న సాగర్ విషయంలో నేను తప్పు మాట్లాడాను.. హరీష్ రావు దగ్గర మీరు చేసింది కరెక్ట్.. నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నాను అన్నారు.

అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మల్లన్న సాగర్ మీద కొట్లాడినా కూడా నా తప్పును ఒప్పుకున్నాను అని తెలిపారు వంటేరు ప్రతాప్ రెడ్డి.

Also Read:బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

- Advertisement -