తెలుగు సినిమా చరిత్రలో గతేడాది విషాదాలు నిండిన సంగతి తెలిసిందే. అయితే ఈ యేడాది కూడా అలాగే కొనసాగుతుంది. కళాతపస్వి మరణం మరువకముందే మరో విషాదం…సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తమిళనాడులోని వెల్లూరులో 1945నవంబరు 30న జన్మించిన వాణీ జయరాం…పదేళ్ల వయస్సులోనే తొలిసారి ఆల్ ఇండియా రేడియోలో తన గళాన్ని విప్పింది.
మొదటి సారిగా 1970లో గుడ్డీ సినిమా ద్వారా నేపథ్య గాయనిగా మారారు. వాణీజయరాం మూడు సార్లు జాతీయ అవార్డులు కైవసం చేసుకున్నారు. అపూర్వ రాగంగళ్ శంకారాభరణం(మానస సంచరరే)స్వాతికిరణం(ఆనతినియ్యరా హరా)పాటలకు లభించింది. వాణీజయరాం తెలుగు హిందీ తమిళ మలయాళ గుజరాతీ మరాఠీ ఒరియా భోజ్‌పురీ…ఇలా 14భాషల్లో దాదాపుగా 10వేలకు పైగా పాటలు ఆలపించారు. వాణీ జయరాంకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వాణీ జయరాం మరణం పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…