లోకసభలో జరిగిన వందే మాతరం చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై ఘాటుగా విమర్శలు చేశారు. మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, మహ్మద్ అలీ జిన్నా అభిప్రాయాలకు ఏకీభవించారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ “వందే మాతరాన్ని రాజీ పడి కోసేసింది అని మోదీ అన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, వందే మాతరం భావోద్వేగం, సాంస్కృతిక ప్రభావం ప్రపంచంలో ఎక్కడా కనిపించని ప్రత్యేకతగలదని పేర్కొన్నారు. ఇది కేవలం దేశభక్తి నినాదం మాత్రమే కాకుండా, స్వాతంత్ర్య పోరాటంలో శక్తివంతమైన యుద్ధ నినాదంగా పనిచేసిందని చెప్పారు. వందే మాతరం స్వాతంత్ర్య సమర స్ఫూర్తికి ప్రతీక అన్నారు.
వందేమాతరం నినాదం భారతీయులలో ధైర్యం, ఐక్యత, తిరుగుబాటు ఆత్మను రగిలించిందని, అది బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచే ప్రధాన ఆయుధంగా మారిందని వివరించారు. స్వాతంత్ర్య ఉద్యమాన్ని నిర్వచించిన ఆత్మవిశ్వాసం, స్వాభిమానం ఈ నినాదంలో నిక్షిప్తమై ఉందని, అది బ్రిటిష్ పాలనకు అత్యంత తగిన సమాధానంగా నిలిచిందని మోదీ అన్నారు. బ్రిటిష్‌లు బెంగాల్ నుంచే divide-and-rule వ్యూహాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించారని, కానీ వందే మాతరం స్ఫూర్తి ప్రజల ఐక్యతను దెబ్బతీయడం వారి వల్ల కాలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
లోకసభలో వందే మాతరం 150ఏళ్ల ప్రత్యేక చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశ గీతానికి సంబంధించిన చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, స్వాతంత్ర్య సమరంలో దాని పాత్ర, అలాగే చాలా మందికి తెలియని విషయాలను పరిశీలించే ఉద్దేశంతో ప్రత్యేక 10 గంటల చర్చ జరగనుంది.
Also Read: MSG:ట్రెండింగ్‌లో శశిరేఖ సాంగ్

