- Advertisement -
వరుస దెబ్బలతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సతమతమవుతోంది. ఇప్పటికే మూడు సార్లు ప్రమాదానికి గురైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు తాజాగా మరోసారి ప్రమాదానికి గురైంది.. శనివారం ఉదయం ముంబై సెంట్రల్ నుంచి గాంధీనగర్‌కు వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఓ ఎద్దును ఢీకొట్టింది. ట్రాక్‌పై పశువు ఢీకొనడంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముందు భాగంలో డ్రైవర్ కోచ్ స్వల్పంగా దెబ్బతిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో ట్రైన్ 15 నిమిషాల పాటు నిలిచిపోయింది.
అక్టోబర్ 6న ముంబై నుంచి గాంధీనగర్‌కు వెళుతున్న క్రమంలో.. వట్వా- మనీనగర్ రైల్వే స్టేషన్ వద్ద గేదెను ఢీకొట్టింది. అప్పుడు కూడా నోస్ ప్యానెల్ దెబ్బతింది. ఆ మరుసటి రోజు గుజరాత్ నుంచి ముంబైకి వెళుతుండగా.. ఆనంద్ సమీపంలో ఓ ఆవు వందేభారత్ రైలును ఢీకొట్టింది.
ఇవి కూడా చదవండి.
కాంతారకు ఎదురుదెబ్బ ఎందుకో తెలుసా
మంచి దొంగ.! దొంగిలిచ్చిన సొమ్ము తిరిగిచ్చేశాడు
మునుగోడు బైపోల్ తర్వాతే విచారణ.
- Advertisement -