వంచన ..రిలీజ్ డేట్ ఫిక్స్

2
- Advertisement -

చండీ దుర్గా ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఉమా మహేష్ ప్రధాన పాత్రలో సూర్య, రాజేంద్ర మరియు ఆర్ కె నాయుడు, సోనీ రెడ్డి ముఖ్య తారాగణం తో ఉమా మహేష్ మార్పు దర్శకత్వం లో గౌరీ మార్పు నిర్మిస్తున్న చిత్రం “వంచన”. అయితే ఈ రోజు ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్ ను సోషల్ మీడియా లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 8 న విడుదల.

ఈ సందర్భంగా దర్శకుడు ఉమా మహేష్ మార్పు మాట్లాడుతూ “వంచన ఒక కోర్టు రూమ్ ఎమోషనల్ డ్రామా చిత్రం. అరకు ఊరిలో ఒక క్రిస్టియన్ ఫాదర్ ని అతి కిరాతకంగా హత్య చేస్తారు. మంచి స్క్రీన్ ప్లే తో అద్భుతమైన ట్విస్టులతో హత్య ఎవరు మరియు ఎందుకు చేస్తారో తెలిపే కోర్టు రూమ్ డ్రామా కథే మా ‘వంచన’ సినిమా. మా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు మా చిత్రాన్ని చూసి సున్నితమైన కథని చాలా గొప్పగా చిత్రీకరించారు అని అభినందించారు.

Also Read:అద్భుతమైన మూవీ ‘కంగువ’:సూర్య

ఇటీవలే మా చిత్ర టీజర్ ను విడుదల చేసాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ను నవంబర్ 2 న విడుదల చేస్తున్నాము. సినిమా చాలా కొత్తగా, మంచి థ్రిల్లింగ్ అంశాలతో ఉంటుంది. అరకు, ఢిల్లీ, మనాలి, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయనగరం, జైపూర్ లాంటి అందమైన లొకేషన్స్ లో మా చిత్రాన్ని రెడ్ డ్రాగన్ సినీ లైన్ కెమెరా తో చిత్రీకరించాం. మా సినిమా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. నవంబర్ 8న విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాము” అని తెలిపారు.

- Advertisement -