‘వనమగన్‌’ ఫస్ట్ లుక్

297
Vanamagan first look
- Advertisement -

టాలీవుడ్,బాలీవుడ్,కోలీవుడ్‌ ఏదైపా ఇప్పుడు అన్ని భాషల్లోని హీరోలంతా ప్రయోగాల బాటే పడుతున్నారు. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా కేవలం కథను నమ్ముకుని సక్సెస్‌ల బాట పడుతున్నారు. అలాంటి జాబితాలో చేరిపోయాడు హీరో జయం రవి. రోమియో జూలియట్, తనీఒరువన్, భూలోకం, మిరుధన్ వంటి సూపర్ హిట్లతో ఫాంలో ఉన్న రవి మరో డిఫరెంట్ జోనర్‌లో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు.

Vanamagan first look

వనమగన్‌(అడవిపుత్రుడు) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అమలాపాల్ మాజీ భర్త, దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో రవి ఓ టార్జన్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. అఖిల్ సినిమా హీరోయిన్ సయేషా సైల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ సినిమా కోసం బాడిని బాగా తగ్గించిన రవి ఓ విల్లు ధరించి ఊడలను పట్టుకుని వేలాడుతున్న పోస్టర్‌కి మంచి స్పందన వస్తోంది. తిరు ఛాయాగ్రహణం, హారీస్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకురాబోతుంది. మన్నెం వీరుడు పేరుతో తెలుగులో అనువాదం అయ్యే అవకాశాలున్నాయి.

- Advertisement -