‘వీడెవడు’ అంటున్న అఖిల్

368
Akhil ... Veedevadu

అక్కినేని నాగార్జున నటవారసుడిగా ఆరంగ్రేటం చేసిన అఖిల్‌ తొలిసినిమాతో అంతగా ఆకట్టుకోలేక పోయాడు. దీంతో తన రెండో సినిమాపై తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటికే పలు కథలు విన్న అంతగా నచ్చక పోవడంతో ఆసక్తి చూపని అఖిల్ … తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్‌ జరుపుతున్న ఈ సినిమా పై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో     అఖిల్ ట్విట్టర్‌లో చేసిన కామెంట్ ఆసక్తికరంగా మరింది.  ప్రీ లుక్‌ను పోస్ట్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్నదెవరో గుర్తించండని అఖిల్ అడిగారు. ‘వీడెవడు?’ అన్న టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీలుక్‌లో హీరో వెనక్కి తిరిగి ఉండగా, మర్డరర్, ఫైటర్, విలన్, గ్యాంబ్లర్ అంటూ పోస్టర్ నిండా రాతలున్నాయి. అఖిల్ విడుదల చేసిన ఈ ప్రీ లుక్ పోస్టర్‌లో ఉన్నదెవరని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Akhil ... Veedevadu

ఈ ఫోటోను ట్వీట్ చేసిన అఖిల్ అతనెవరో కనుకునేందుకు హింట్ కూడా ఇచ్చాడు. అతను నా టీంమెట్ అంటూ క్లూ ఇచ్చాడు. కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసిన అఖిల్, ఆ సినిమా కోసం నితిన్తో కలిసి పనిచేశాడు. అఖిల్ తొలి సినిమాకు నితిన్ నిర్మాత. దీంతో అఖిల్ చెప్పిన టీంమెట్ నితిన్ అయి ఉంటాడంటున్నారు ఫ్యాన్స్. నితిన్‌తో పాటు హర్షవర్ధన్, సచిన్ జోషి తదితర హీరోల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఫస్ట్‌లుక్‌లో వీడెవడులో ఉన్నదెవరో తేలిపోనుంది.

నితిన్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓల్డ్ సిటీ కుర్రాడిగా రఫ్ లుక్లో కనిపించనున్నాడు నితిన్. సీనియర్ నటుడు అర్జున్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీంతో ఈ పోస్టర్ నితిన్ సినిమాకు సంబంధించిందా లేదా అఖిల్ సినిమాకు సంబంధించిందా తెలియాలంటే అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వేచిచూడాల్సిందే.