నవలగా ఎన్టీఆర్‌ టెంపర్..

314
vamsi-turned-ntrs-temper-english-novel
vamsi-turned-ntrs-temper-english-novel
- Advertisement -

తెలుగు సినిమా కధ కి పట్టాభిషేకం. తెలుగు కధా రచయితలు గర్వపడాల్సి న సమయం. తెలుగులో బ్లాక్‌ బస్టర్ అయిన టెంపర్ సినిమాని ఆంగ్లంలో నవలగా రాసారు స్టార్ రైటర్ కాబోయే డైరెక్టర్ అయిన వక్కంతం వంశీ. ఈ నవల ని హారీపోట్టర్ ని పబ్లిష్ చేసిన ప్రముఖ ప్రచు రణ సంస్థ అయిన బూమ్స్ బర్రీ పబ్లిష్ చేస్తోంది. అమెరికా, యు.కె, ఇండియాల్లో శాఖలని కలిగి వున్న ఈ సంస్థ ప్రచురించిన పుస్తకాల్లో నోబుల్ పైజ్ వచ్చిన నడిన్గార్జిమర్, బుక్కర్ పైజ్ వచ్చిన మార్గరెట్ అట్వడ్, మైఖేల్ ఆండార్టీ, హెలావార్డ్ జాకబ్సన్ వంటి రచయితల తో పాటు, ఆరెంజ్ పైజ్ వచ్చిన అన్నీ మైఖేల్స్, డబ్యుహెచ్ స్మిత్ అవారు వచ్చిన డోన్నా టార్ట్, కామెన్ వెల్స్ రైటర్స్ పైజ్ వచ్చిన రచ యితలు రాసిన పుస్తకాలున్నాయి. బూమ్స్ బర్రీ నుంచీ వచ్చిన హారీపోట్టర్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధి క సంఖ్యలో అమ్ముడయిందన్న విషయం అందరికీ విదితమే.

ఈ నేపధ్యంలో అటువంటి అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థని తెలుగు కధ టెంపర్ ఆకట్మకోవడం తెలుగు రచయితల కి గర్వకారణమనే చెప్పాలి.

వక్కంతం వంశీ రాసిన టెంపర్ తెలుగు లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చి పేక్షకులని ఒక ఊపు ఊపిన విషయం తెల్సిందే. దయ అనే కరెప్టడ్‌ పోలీస్ ఆఫీసర్ కధ ఇది.

అనాధగా రక రకాల అవమానాలకి గురి అయిన దయ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. డబ్బుకోసం ఏదైనా చేస్తాడు దయ. అలాంటి దయ, నీతికోసం న్యాయం చేయడం కోసం ఏదైనా చేయాలని ఫిక్స్ అయినప్పుడు ఏం చేస్తాడు అనేదే టెంపర్ కధ.

పబ్లిషర్స్ ప్రతినిధి ప్రవీణ్‌ మాట్లాడుతూ, ఈ కధలో ఒక యూనివర్సల్ పాయింట్ వుంది. ప్రపంచాన్ని ప్రేరేపించే సందేశం వుంది. దయ క్యారెక్టర్ మాకు నచ్చింది. ఇటీవల కాలంలో గ్లోబల్ గా వచ్చిన క్యారెక్టర్ డ్రివెన్ కధల్లో టెంపర్ ని ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా అందరి మనసులూ దోచుకుంటుందని మేం నమ్ముతున్నాం” అని అన్నారు.

4317brktempes

వక్కంతం వంశీ పుస్తకానికి ప్రాతినిధ్యం వహించిన వర్డ్ ఫేమస్ లిటరరీ ఏజెన్సీ ప్రతినిధి లిటరరీ ఏజెంట్ దీప్తిపటేల్ మాట్లాడుతూ, రచయిత వక్కంతం వంశీ గారు రాసిన టెంపర్ ఆంగ్ల నవలకి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ నవల ఎండింగ్ సినిమా ఎండింగ్ కాదనీ, నిజానికి ఈ నవల చదవడం పూర్తయిన వెంటనే తను చాలా సేపు తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యానని పేర్కొన్నారు. వక్కంతం వంశీ తెలుగులోనే కాదు ఆంగ్లం లో కూడా తన ప్రతిభని చాటుకోనున్నారు. టెంపర్ ఆంగ్ల నవల త్వరలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లోకి కాబోతోంది.

- Advertisement -