వాల్మీకి టైటిల్ చేంజ్‌..ఓడిపోయా: హరీష్ శంకర్‌

656
harish shankar
- Advertisement -

వాల్మీకి టైటిల్‌పై తొలి నుంచి వివాదం తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక విడుదలకు ఒకరోజు ముందు కీలకపరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు సూచనతో సినిమా పేరును వరుణ్ తేజ్ క్యారెక్టర్ పేరు అయిన గద్దలకొండ గణేష్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన హరీష్..భావోద్వేగానికి గురయ్యారు.

వాల్మీకి మూవీ టైటిల్ వివాదం ద చాలా బాధపెట్టిందని తెలిపారు. మొదటిసారి తాను ఓడిపోయానని అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోవడం అంటే వ్యక్తిగతంగానో, దర్శకుడిగానో,రచయితగానో కాదని.. ఒక హైందవ సమాజానికి చెందిన వ్యక్తిగా వాల్మీకి మహర్షి మీద ఉన్న ఒక గొప్ప గౌరవాన్ని, ఒక మంచి విషయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తాను ఓడిపోయానని అనిపిస్తోందని అన్నారు.

వాల్మీకి మ‌హ‌ర్షి త‌ప్పు చేసిన‌ట్లు సినిమాలో ఎక్కడా చూపించ‌లేదు.. సినిమా చూసిన త‌ర్వాత నిర‌స‌న‌ తెలియజేసిన వారు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారని చెప్పారు. మేం ఓ మంచి టైటిల్‌ను పెట్టాం…. ఇలాంటి టైటిల్‌ను పెట్టడం ద్వారా వాల్మీకి మ‌హ‌ర్షి గొప్పత‌నం తెలియ‌నివారికి కూడా తెలుస్తుంద‌ని అనుకున్నామని చెప్పారు.సినిమా ఎలా ఉందో తెలియ‌కుండా తాను ఎవ‌రికి క్షమాప‌ణ చెప్పాలో అర్థం కావ‌డం లేదన్నారు.

వాల్మీకి , బోయ సోద‌రులు ఈ సినిమా చూడాల‌ని.. చూసిన త‌ర్వాత ఏదో మూల నిజ‌మే క‌దా! వాల్మీకి మ‌హర్షిని ఎక్కడా త‌ప్పుగా చూపించ‌లేదని వారి అంతరాత్మకు అనిపిస్తే అదే చాలన్నారు.

- Advertisement -