గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఐఏఎస్ వల్లూరి క్రాంతి..

420
gic
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమమంలో పాల్గొన్నారు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన మున్సిపల్ కమిషనర్ కార్యాలయం లో మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం , కాలుష్య నివారణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ గారు తీసుకుంటున్న చొరవ చాలా గొప్పది , కరీంనగర్ లో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చాల అభివృద్ధి జరిగింది , కేసీఆర్ గారి హరితహారం కార్యక్రమం లో రోజు పాల్గొని కోట్ల మొక్కలు నాటి , వాటిని కాపాడే దిశగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.

తనకు వ్యక్తిగతంగా మొక్కలు నాటడమంటే చాలా ఇష్టం అని , అవగాహనా లోపంతో ఇప్పటికి మనం మొక్కలు నాటడం లేదు , ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రజల్లలో మంచి చైతన్యం తీసుకొచ్చింది , ఇప్పుడు మొక్కలు నాటడం అంటే గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటుతున్నాం అనే స్థాయికి చేరింది .ఇంతటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు . ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -