ఈ రోజు వాలంటైన్స్ డే.ప్రేమికులకు మరచిపోలేని రోజు. వెరైటీ గిఫ్ట్ లు, రంగుల పూల బుకేలతో తమ ప్రియ నేస్తాన్ని ఇంప్రెస్ చేయాలని ఆరాటపడుతుంటారు. ప్రేమికుల రోజు అనగానే అందరికి గుర్తుచ్చే పూలు.. రోజా పూలు. రోజాపూలకు ప్రేమికులకు ఎంతో స్పెషల్. లవ్ ప్రపొజ్ చేయాలంటే.. రోజా పూలు ఉండాల్సిందే. ఒక్క గులాబీ పూలే కాదు.. పరిమాళాలు వెదజల్లే మరెన్నో పూలు (లిల్లీలు, ప్రైమ్ రోజెస్), తెల్ల రోజా, పింక్ రోజాపూలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి.
ప్రేమికుల రోజును పూలకు ఫుల్ డిమాండ్. ఆసియాలోనే అతిపెద్ద మార్కెటైన ఢిల్లీలో ప్రతిఏడాది రెట్టింపు వ్యాపారం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క పువ్వుకి ప్రత్యేకమైన అర్ధం ఉంటుంది. కొన్ని పూలు విషెస్‌ని చెబితే మరికొన్ని పూలు ప్రేమను తెలియజేస్తాయి.
()వాలంటైన్స్ డే రోజున ఫుల్ గిరాకీ ఉండే పూలలో రోజా పూలు ఒకటి. ప్రేమికులే కాదు.. ప్రతి ఒక్కరూ గులాబీ అంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు. ప్రేమని తెలియజేయడానికి ఇది ఒక చిహ్నంగా నిలుస్తుంది. సొగసైన ఆకారం ,మర్చిపోలేని సువాసన వీటి సొంతం. రోజ్ బొకే కి మించిన ఉత్తమమైన బొకే ఇంకొకటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు.
()స్వచ్ఛమైన ప్రేమకు, నమ్మకానికి,విశ్వాసానికి ప్రతీకగా నిలిచే పూవు అభిరుచి పువ్వు. మీరు ఏమి చెప్పదలుచుకున్నారో ఆ విషయాలన్నింటిని మీరు ప్రేమించే వ్యక్తికి ఈ పువ్వు బహుమతిగా ఇవ్వడం ద్వారా తెలియజేయవచ్చు. ఈ పువ్వు నిత్యం పూస్తూనే ఉంటుంది.
()ఖచ్చితత్వమైన ప్రేమను తెలియజేసే పూలు తులిప్స్. ఎరుపు తులిప్స్ నిజమైన ప్రేమకు చిహ్నంగా నిలిస్తే, ఊదా రంగు తులిప్స్ విధేయతకు చిహ్నంగా నిలుస్తాయి. మీరు వివిధరకాల తులిప్స్ పూల కలయికను బహుమతిగా ఇవ్వవచ్చు. ఇవి మంచి తనానికి ప్రతీకగా నిలుస్తాయి.
()జాగ్రత్తకు మరియు వినయంకి చిహ్నంగా నిలిచేపూలు ఫేన్సీ పూలు. మీ స్నేహితులకు లవర్స్ డే గిఫ్ట్‌గా వీటిని ఇవ్వొచ్చు.ఇవి చాలా సున్నితమైనవి, ప్రకాశవంతమైనవి మరియు అందమైనవి. ఏ తోటకైనా అందాన్ని తెచ్చిపెట్టగలవు.
()ఎస్టర్ పూవు వీటిని వశీకరణ పువ్వు అనికూడా పిలుస్తారు. మధ్యలో పసుపుపచ్చ రంగులో ఉండి, ఎంతో అందమైన రంగులతో ఇవి విరపూస్తాయి.
()కార్నేషన్లు చూడటానికి నక్షత్రాల్లా ఉండే ఈ పూలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. కార్నేషన్లలో ఉండే ప్రతి ఒక్క రంగుకి, ఒక ప్రత్యేకత ఉంది.
()ప్రకృతిలో లభించే పూలలో మంత్రముగ్దులను చేసే వాటిలో ఒకటి ప్యూనిస్. ప్యూనిస్ పూలను ఉపయోగించి బొకే లను గనుక తయారుచేసినట్లైతే గనుక, వసంత ఋతువు వచ్చిందని అర్ధం.
()ఐరిస్ : ఇవి విశ్వాసానికి, సౌర్యానికి మరియు జ్ఞానానికి చిహ్నంగా నిలుస్తాయి. ఈ విషయాన్ని ఎవరైనా ఎదుటి వ్యక్తికి తెలియజేయాలనుకుంటే, వీటిని బహుమతిగా ఇవ్వవచ్చు. ఇంకేంటి ఆలస్యం లవర్స్ డే రోజున మీ పార్ట్‌నర్ మనసుకి నచ్చే పూవుని ఇచ్చి ఇంప్రెస్ చేసేయండి.
Also Read:హ్యాపీ వాలెంటైన్స్ డే..