ప్రేమలేని మనిషి లేడు. ప్రేమలేని జీవితం లేదు. ప్రేమలేని లోకం లేదు. … మృదుమధురమైన ప్రేమ ఒక గొప్ప శక్తి. మనిషి జీవితంలో ప్రేమ ఒక అనుభూతి. ఒక తపన, ఒక ఆర్తి. ఆవేదన. మనకంటూ ఒక మనిషి కావాలనే తపనే ప్రేమ. తను ప్రేమించిన మనిషికోసం ప్రేమికులు ఏదైనా చేస్తారు. ప్రేమతో ఏదైనా చెబితే అది శాసనమే. ప్రేమించిన మనిషికోసం కన్నవారిని కూడా వదిలి వచ్చేస్తున్నారంటే అది ఎంత బలమైందో అర్థమవుతుంది.
జీవితంలో నిజమైన ప్రేమ దొరికినప్పుడు ఇంకేదీ కోరాలనిపించదు. ఇంకేదీ కావాలనిపించదు. ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది. మనసుతో చూడాలే కానీ .. .. ప్రేమలో లేనిది లేదు. మనకు, మనసుకు దొరకనిది లేదు. ప్రేమలో ఆనందం ఉంది. ఆవేదన ఉంది. ఆలోచన ఉంది. ఇటువంటి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ప్రతీ రోజు ప్రేమికులు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. కానీ ప్రేమికుల రోజు మాత్రం వారికి ప్రత్యేకం.
ప్రేమ కులానికి, సినిమా కులానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. ప్రేమికులపై సినిమాల ప్రభావం చాలా ఉంది. టాలీవుడ్ స్టార్లు నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్,అల్లు అర్జున్ తో పాటు పలువురు సెలబ్రిటీలు ప్రేమ వివాహాం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ప్రేమికుల రోజుకి వారు విషెస్ చెప్పడమే కాదు టాలీవుడ్ సైతం ఫస్ట్ లుక్,టీజర్,ట్రైలర్‌లతో సర్ ప్రైజ్ ఇస్తుంది. మరి ఈ వాలెంటైన్స్ డేకి టాలీవుడ్ అందించిన ప్రేమకానుక ఏంటో చూద్దాం.