౩౦న వకుళమాత ఆలయ వార్షికోత్సవం

4
- Advertisement -

తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న శ్రీ వకుళమాత ఆలయంలో జూన్ 30వ తేదీ వార్షికోత్సవ ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి ఉత్సవర్లకు అష్టోత్తర కలశాభిషేకం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొంటారు.

Also Read:మీ శరీర భాగాలు జాగ్రత్త..

- Advertisement -