వకీల్ సాబ్ “మగువా మగువా” లిరిక‌ల్ సాంగ్

486
maguva
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా బోణి కపూర్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం ఇప్పటికే సగం వరకు పూర్తైంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని మే15న విడుదల చేయనున్నారు.

ఇటీవ‌ల మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా .. మగువా మగువా.. నీ సరిహద్దులు కలవా .. అంటూ సాగే ఈ పాట ప్రోమో వీడియో విడుద‌ల చేసిన చిత్ర బృందం ఈరోజు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఫుల్ లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేశారు. రామ‌జోగ‌య్య శాస్త్రి ఈ పాట‌కి అద్భుత‌మైన లిరిక్స్ రాయ‌గా, సిద్ శ్రీరామ్ పాడారు. మ‌హిళ గొప్ప‌ద‌నం తెలుపుతూ సాగే ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

- Advertisement -