‘ఉప్పెన’ మూవీతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సంచలన విజయాన్ని నమోదు అందుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతూ వస్తున్నారు. ఈనేపథ్యంలో వైష్ణవ్ తేజ్ గిరీశాయ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా తాజాగా షూటింగు ప్రారంభమైంది. ఈ సినిమాకి బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ అలరించనుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ.. వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బ్యానర్‌లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసి సక్సెస్ సాధించిన సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరీశాయ ఈ చిత్రంతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయం చేస్తున్నాము. ఉప్పెనతో యూత్‌కు దగ్గరైన వైష్ణవ్ తేజ్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గర చేసేలా.. మంచి కథతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందించబోతున్నాం అని తెలిపారు.