దూకుడు పెంచేసిన ‘బేబీ’

45
- Advertisement -

చిన్న సినిమాగా విడుదలైన ‘బేబీ’ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఆ ఒక్క సినిమాతో నటులు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ తో పాటు హీరోయిన్ వైష్ణవి చైతన్యకు కూడా వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు అమ్మాయిగా గుర్తింపు పొందిన వైష్ణవి ఒక్కసారిగా టాలీవుడ్‌ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారింది. ఇప్పుడు తన చేతిలో ఏకంగా అయిదు సినిమాలుండగా, వీటిలో రెండు సెట్స్‌పై ఉన్నాయి. పైగా నిన్న కూడా వైష్ణవి చైతన్య లిస్ట్ లో మరో సినిమా చేరింది. నిన్న వైష్ణవి చైతన్య బర్త్ డే. ఈ నేపథ్యంలో ఆమె కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఓ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవిని ఎంపిక చేశారు. ఈ మేరకు వైష్ణవి ముస్లిం అమ్మాయి పాత్ర ఫస్ట్ లుక్‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొత్తానికి ‘బేబీ’ సినిమాతో యూత్‌ను ఆకట్టుకున్న ఈ తెలుగు నటి నుండి మరిన్ని తెలుగు సినిమాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. పైగా ‘బేబీ’ వైష్ణవి అంటూ ఆమెకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ పెరిగింది. ఆమెకంటూ కొత్తగా ఫ్యాన్స్ పేజీలు కూడా పుట్టుకొస్తున్నాయి.

అందుకే, వైష్ణవి చైతన్యకు సినిమాలతో పాటు యాడ్స్ కూడా వస్తున్నాయి. అలాగే బిగ్ బాస్ లో కూడా ఆమెకు ఆఫర్లు వచ్చాయి. తెలుగు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 త్వరలో ప్రారంభం కానుంది. నాగార్జున హోస్టుగా వ్యవహరించిన ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టంట్లు వీరేనంటూ ఓ ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న భోలే షావలి, శోభాశెట్టిలతో పాటు వైష్ణవి చైతన్యకు కూడా ఆఫర్ వచ్చిందట. కాకపోతే, ఈ ఓటీటీ సీజన్‌కు వైష్ణవి చైతన్య ఎంట్రీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండటం వల్ల, ఆమె బిగ్ బాస్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

Also Read:స్టోన్ ఫ్రూట్స్ తో క్యాన్సర్ కు చెక్!

- Advertisement -