భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సంవత్సరం 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కావడం లేదు. ఈ నెల ప్రారంభంలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించగా, ఫైనల్లో ఇంగ్లండ్‌పై కేవలం 80 బంతుల్లో రికార్డు స్థాయిలో 175 పరుగులు చేసి జట్టుకు ట్రోఫీ అందించాడు.
టోర్నమెంట్ అనంతరం అతను బోర్డు పరీక్షలకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, క్రికెట్ కట్టుబాట్లకు ప్రాధాన్యం ఇస్తూ పరీక్షలను వదిలివేయాలని నిర్ణయించుకున్నాడు. 14 ఏళ్ల వైభవ్ బీహార్‌లోని తాజ్‌పూర్‌లో ఉన్న మోడెస్టీ స్కూల్‌లో చదువుతున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. అయితే గత ఏడాది మొత్తం ఇండియా అండర్-19, ఇండియా-ఏ జట్లతో పర్యటనల కారణంగా పరీక్షలకు సన్నద్ధం కావడానికి తగిన సమయం దొరకలేదు.
వైభవ్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌పై దృష్టి పెట్టాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో అతను ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇప్పటికే ప్రీ-సీజన్ శిబిరంలో పాల్గొంటున్నట్లు అతని కోచ్ మనీష్ ఓజా తెలిపారు.
Also Read:కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తున్నా!

