ఐపీఎల్ 2025లో అద్భుతం జరిగింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. 14 ఏళ్లకే ఐపీఎల్‌లో అడుగుపెట్టిన వైభవ్…35 బంతుల్లోనే సెంచరీ చేసి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 11 సిక్స్‌లు 7 ఫోర్లతో 101 పరుగులు చేసిన వైభవ్.. గుజరాత్ బౌలర్లకు పీడకలనే మిగిల్చాడు. యశస్వి జైస్వాల్ 70 పరుగులు చేయగా రియాన్ పరాగ్ 32 పరుగులు చేశారు. ఆరంభం నుండే గుజరాత్ బౌలర్లలో విరుచుకపడటంతో 15.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కొల్పోయి 212 పరుగులు చేసింది.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లు కొల్పోయి 209 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 39 పరుగులు చేయగా శుభ్‌మన్ గిల్ 54, బట్లర్ 50 పరుగులు చేయడంతో గుజరాత్ భారీ స్కోరు సాధించింది.
ఐపీఎల్‌తో పాటు టీ20ల్లో సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ వైభవ్‌దే.
Also Read:ఎండు ద్రాక్షతో.. మహిళలకు ఆరోగ్యం!

