సూర్యవంశీ..ప్రపంచ రికార్డు!

1
- Advertisement -

టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు సృష్టించారు. 2022 టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అయిన బట్లర్ ది హండ్రెడ్ 2026 లీగ్‌లో ఈ ఘనత సాధించారు. మాంచెస్టర్‌లో వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున కేవలం 20 బంతుల్లోనే 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు.

సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిన బట్లర్, టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన కీరన్ పోలార్డ్ రికార్డును అధిగమించారు. మాంచెస్టర్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన ఈ ఇంగ్లాండ్ స్టార్, పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకు 522 మ్యాచ్‌ల్లో 14,833 పరుగులు సాధించారు.

తన ఘనతపై స్పందించిన బట్లర్, భవిష్యత్తులో భారత టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20లలో అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. టీ20 క్రికెట్‌లో అందరికంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడం నిజంగా చాలా గొప్పగా అనిపిస్తోంది. కానీ భవిష్యత్తులో ఎవరో ఒకరు ఈ రికార్డును అధిగమిస్తారు బహుశా ఆ పేరు సూర్యవంశీ కావచ్చు అని జట్టును మళ్లీ విజయాల బాట పట్టించిన అనంతరం పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో బట్లర్ పేర్కొన్నారు.

Also Read:బడికి వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలా!

టీ20 ప్రపంచ కప్ 2026తో సహా బట్లర్ కొంతకాలంగా ఫామ్‌లో లేరు. అయితే ఐపీఎల్ 2026 సమయంలో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన ఆయన, ప్రస్తుతం జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్నీలోనూ అదే జోరును కొనసాగిస్తున్నారు. తన ఫామ్‌ గురించి బట్లర్ మాట్లాడుతూ నేను బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నానని నాకు అనిపించింది. దాంతో పాత వీడియోలను చూసి బంతి విసిరే సమయానికి నేను ఏ పొజిషన్‌లో ఉండాలో విశ్లేషించుకుని మళ్లీ సాధన చేశాను. ఐపీఎల్ సమయంలో దీనిపై తీవ్రంగా శ్రమించాను, ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తున్నాను. ఐపీఎల్ నాకు ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పారు.

- Advertisement -