వాడేన.. టీజర్ విడుదల

278
Vadena Movie Teaser Launch
- Advertisement -

నిర్మాని ఫిలిమ్స్ బ్యానర్ పై శివ్ తాండల్, నేహా దేశ్ పాండే , అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న వాడేనా చిత్రానికి దర్శకుడు సాయి సునీల్ నిమ్మల కాగా, మణిలాల్ మచ్చి అండ్ సన్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ మరియు పోస్టర్ ల విడుదల కార్యక్రమాన్ని సోమవారం ఉదయం అతిథులు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, రాజ్ కందుకూరి, మల్కాపురం శివ కుమార్, సంతోషం సురేష్ కొండేటి, శివల చేతుల మీదుగా జరుపుకున్నారు.

Vadena Movie Teaser Launch

ఈ సంధర్బంగా అతిథులు మాట్లాడుతూ సినిమా కంటెంట్, క్వాలిటీ బాగుండి తగిన ప్రమోషన్స్ చేయగలిగితే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను తప్పకుండా ఆదరిస్తారు. మా వంతు సహాయ సహకారాలు ఈ చిత్రానికి అందిస్తామని తెలియచేసారు. లవ్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. నిర్మాతలే ఈ వాడేన చిత్రానికి హార్ట్ లాంటి వారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మించారు. స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ కనుక ప్రతి పేక్షకునికి నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నానని ఈ చిత్ర దర్శకుడు సాయి సునీల్ నిమ్మల తెలిపారు. మా రెండు సంవత్సరాల ప్రయాణమే వాడేన చిత్రం. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా దర్శకుడు అడిగింది అందించాము అని నిర్మాతల్లో ఒకరైన ధృవ్ అన్నారు. హీరో శివ్ పాండే, హీరోయిన్ నేహా పాండే తదితరులు పాల్గొని తమ అభినందనలు తెలియచేసారు.

Vadena Movie Teaser Launch

శివ్ తాండల్, నేహా దేశ్ పాండే, అజయగోష్, సూర్య, నల్ల వేణు, చిత్రం శీను, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: సి. భీమేశ్వర చారి, మాటలు: సాయి సునీల్ నిమ్మల, సి. భీమేశ్వర చారి, లిరిక్స్: కాసర్ల శ్యామ్, సాయి సునీల్ నిమ్మల, కొరియోగ్రఫీ: ఆర్కే, ఫైట్స్: రవి, ఎడిటర్: ఎస్.బి. ఉధవ్, ఆర్ట్: బాబ్జి, సినిమాటోగ్రఫీ: డి.ఆర్. వెంకట్, మ్యూజిక్: కిరణ్ వెన్న, ఆర్ ఆర్: ఎస్. రాజేష్, నిర్మాత: మణిలాల్ మచ్చి, అండ్ సన్స్, స్క్రీన్ ప్లే దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల.

- Advertisement -