గిన్నిస్‌లోకి ఎక్కింది.. ఎందుకో తెలుసా !

208
This rabbit creates A World Record
This rabbit creates A World Record
- Advertisement -

అమెరికాలోని లాస్ఏంజెలీస్ ప్రాంతానికి చెందిన షాయ్ అసోర్‌ ఓ కుందేలును పెంచుకుంటున్నాడు. ఇది మాములు కుందేలు కాదు.. బాస్కెట్‌ బాల్ ప్లేయర్, పెయింటర్, క్లీనర్.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ కుందేలు సొంతం. ఇజ్రాయిల్‌లో పుట్టిన ఈ కుందేలు పేరు బిని. ఇది తన బాస్కెట్‌ బాల్‌ స్కిల్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కూడా దీని సొంతం. ఇంతకీ వరల్డ్‌ గిన్నిస్‌ రికార్డ్‌ దేనికంటే ఒక్క నిమిషంలో ఎక్కువ సార్లు (7 సార్లు) బాల్‌ను బాస్కెట్‌లో వేసిన కుందేలుగా బినీ రికార్డు సృష్టించింది.

ఈ కుందేలుకు ఏది నేర్పించినా త్వరగా నేర్చుకోవడం దీని ప్రత్యేకత. ఒక‌రోజు అది బాస్కెట్ బాల్‌తో ఆడుకోవ‌డం చూసి షాయ్ దాని కోసం ప్ర‌త్యేకంగా చిన్న సైజు బాస్కెట్ బాల్ కోర్టు ఏర్పాటు చేసి.. అందులో దానికి బాస్కెట్‌లో బాల్ వేయ‌డం నేర్పించాడు. ఈ కుందేలుకు పెయింటింగ్ వేయ‌డం కూడా వ‌చ్చు. అలాగే చిన్న వాక్యూమ్ క్లీన‌ర్‌తో త‌న నివాసాన్ని శుభ్రం చేసుకోవ‌డం కూడా తెలుసు. అలా దీని ప‌నిత‌నానికి ఎంతో మంది ముచ్చ‌ట‌ప‌డి లైకుల వ‌ర్షం కురిపిస్తుంటారు. దీనికి సోష‌ల్ మీడియాలో దాదాపు 81 వేల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇది చేస్తున్న ప‌నుల‌ను షాయ్ సోష‌ల్ మీడియాలో పెడుతుంటాడు. బినీ త‌న‌కు ఇంత పేరు తెచ్చిపెడుతుంద‌ని తానెప్పుడూ ఊహించ‌లేద‌ని షాయ్ అసోర్ చెబుతున్నాడు.  ఈ వీడియో మీరు చూడండి..

- Advertisement -