T’RS’ స‌భ్యుడిగా వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌ ఎన్నిక‌..

134
ravi
- Advertisement -

టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌ (గాయ‌త్రి ర‌వి) ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి నుంచి వ‌ద్దిరాజు ర‌విచంద్ర ఎన్నిక ప‌త్రాన్ని స్వీక‌రించారు. రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు నేటితో ముగిసింది.

సమా‌జ్‌‌వాదీ పార్టీకి చెందిన జాజుల భాస్కర్‌, స్వతంత్ర అభ్యర్థి భోరజ్‌ కొయా‌ల్కర్‌ నామి‌నే‌షన్లు సక్ర‌మంగా లేని కార‌ణంగా తిర‌స్క‌రిం‌చి‌నట్టు, నామి‌నే‌షన్ల పరి‌శీ‌లన అనం‌తరం ఎన్నిక‌ల అధికారి వెల్ల‌డిం‌చిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఎవ‌రూ పోటీ లేక‌పోవ‌డంతో వ‌ద్దిరాజు ర‌విచంద్ర ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది. ఈ సందర్భంగా వద్దిరాజు ర‌విచంద్ర‌ను టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించి శుభాకాంక్ష‌లు తెలిపారు.

- Advertisement -