హైదరాబాద్‌లో ఆటో, టాక్సీ డ్రైవర్లకు వ్యాక్సినేష‌న్..

162
- Advertisement -

తెలంగాణలో సూప‌ర్ స్ప్రెడ‌ర్ల‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ఇందులో భాగంగా గురువారం రాష్ట్రం రవాణా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు,క్యాబ్ డ్రైవర్లకు వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు.రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభించారు.

ఇందుకోసం జీహెచ్ఎంసీ ప‌రిధిలో 10 కేంద్రాల‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఉద‌యం 10 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు టీకాల పంపిణీ కొన‌సాగ‌నుంది. టీకాలు వేయించుకునే వారు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌, ఆర్సీ జీరాక్స్ కాపీ తీసుకురావాల‌ని అధికారులు సూచించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ ప‌రిధిలో 3 ల‌క్ష‌ల‌కుపైగా ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్లు ఉన్నార‌ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు,డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు,సిపి అంజనీ కుమార్,హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి,ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ లో ఈరోజు 4 వేల మందికి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమైంది. 10 రోజుల్లో ఇంకా పెంచి అందరికి వ్యాక్సిన్ ఇస్తాం. మీరు పబ్లిక్‌తో ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతారు కాబట్టి ముఖ్యమంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు రెండు లక్షల మందికి ఇవ్వలని నిర్ణయించాం. మీరు ఎంతో రిస్క్ తీసుకొని పబ్లిక్‌లో తిరుగుతుంటారు. ఇది మంచి కార్యక్రమం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన గొప్ప అవకాశం. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు బీద వారు ఉంటారు అందుకే వ్యాక్సిన్‌ అందరకీ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మొత్తం 10 సెంటర్లు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నము. అందరూ వ్యాక్సిన్ తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.

- Advertisement -