జీలకర్రతో ఎన్ని ఉపయోగాలో!

80
- Advertisement -

నేటి రోజుల్లో చాలమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలో మలబద్దకం, అధిక బరువు, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్, జుట్టు రాలడం, చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వంటి ఎన్నో సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. దాంతో ఇలాంటి సమస్యలను చాలమంది తేలికగా తీసుకొని మరిన్ని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అందువల్ల ఇలాంటి వాటిని అశ్రద్ద చేయరాదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పైన చెప్పిన ఆరోగ్య సమస్యలకు వంటింట్లో దొరికే నల్ల జీలకర్ర ఎంతగానో ఉపయోగ పడుతుందట. రుచిలో కాస్త చేదుగా ఉన్నప్పటికి ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనీ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నల్ల జీలకర్ర మరియు తమలపాకు ముక్కలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని వడగట్టుకొని తాగడం వల్ల గ్యాస్ సమస్య దూరం అవుతుందట..

అలాగే షుగర్ వ్యాధి కూడా కంట్రోల్ లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా మలబద్దకం కూడా తొలగిపోతుందట. ఒక గ్లాస్ నీటిలో నల్ల జీలకర్రను మరిగించి ప్రతిరోజూ తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. త్వరగా బరువు తగ్గడానికి సహకరిస్తుండట. ఇంకా ఇలాగే ప్రతిరోజూ చేయడం వల్ల పురుషుల్లో ఎక్కువమంది ఎదుర్కొనే అంగస్తంబన సమస్య దూరం కావడంతో పాటు వీర్య కణాల వృద్ది కూడా పెరుగుతుందట. ఇక ఒక టేబుల్ స్పూన్ నల్లజీలకర్ర పొడిని కొబ్బెరి నూనెతో కలిపి జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుందట. అంతే కాకుండా జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా మూత్ర పిండాల సమస్యలు, కాలేయ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు వంటివి తగ్గించడంలో కూడా నల్ల జీలకర్ర ఎంతగానో ఉపయోగ పడుతుందట. అందువల్ల నల్లజీలకర్ర విషయంలో అశ్రద్ద వద్దని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -