ఇవాల్టీ నుంచి టీవి9లో బిత్తిరి సత్తి.. కొత్త గెటప్ చూశారా?

774
sathi
- Advertisement -

బిత్తిరి సత్తి ఈపేరుకు పరిచయం అక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న పేరు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సత్తి తమ ఇంట్లో వ్యక్తిగా ఫీలవుతారు. ఎంతో మంది ప్రేక్షకుల ప్రజాదరణ పొందన సత్తి మనకు ఇన్ని రోజులు వీ6 ఛానల్ లో కనిపించేవాడు. బిత్తిరి సత్తి వల్ల వీ6 ఛానెల్ రెటింగ్స్ కూడా బాగా పెరిగాయి. పల్లె టూర్లలోనే కాకుండా సిటీల్లో కూడా బిత్తిరి సత్తి ప్రోగ్రాంను చాలా మంది చూస్తున్నారు. తీన్మార్ వార్తలతో పాటు పలు సినిమాలు, టీవీ కామెడీ షోలు, ప్రైవేట్ ప్రోగ్రామ్స్‌లో కూడా బిత్తిరిసత్తి అప్పుడప్పుడు కనిపించేవాడు. తెలంగాణ యాసతో, తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తూ వీ6 న్యూస్ ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లింది.

bithiri sathi v6

ఈ క్రమంలో ఆఫ్ బీట్ వార్తలకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. టీఆర్పీ రేటింగ్స్ కూడా బాగా వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఛానల్స్ కూడా తీన్మార్ వార్తలను పోలిన ప్రోగ్రామ్స్‌ను సిద్ధం చేసుకున్నాయంటే అతిశయోక్తి కాదు. కానీ ఇటివలే పలు వ్యక్తిగత కారణాల వల్ల సత్తి వీ6ఛానల్ కు రాజీనామా చేసి టీవి9లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈసందర్భంగా నిన్న సాయంత్రం ఓ వీడియోను కూడా విడుదల చేశాడు సత్తి. తనను వీ6 యాజమాన్యం చాలా బాగా చూసుకుందని…నేను ఎక్కడ ఉంటే అక్కడికి కెమెరాలు పంపించి నన్ను ఎంకరేజ్ చేశారని చెప్పారు. ప్రతి మనిషి కొత్త దనం కోరుకుంటాడని అందులో భాగంగానే తాను కూడా వేరే ఛానల్ కు మారుతున్నట్లు ప్రకటించాడు.

Bittiri-Satti

ఇకపై తాను టీవి9లో కనిపించనున్నానని..ఇందుకు ముందు అయితే ఎలా ఆదరించారో అలాగే మళ్లీ ఆదరిస్తారని ప్రేక్షకులను కోరుతున్నట్లు తెలిపాడు. ఇటివలే తీన్మార్ సావిత్రి అలీయాజ్ శివజ్యోతి ఆ ఛానల్ కు రాజీనామా చేసి బిగ్ బాస్ 3 లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సావిత్రి వెళ్లిన కొద్ది రోజులకే సత్తి వెళ్లిపోవడంతో వీ6 కు భారీ షాక్ అనే చెప్పుకోవాలి. తాము సృష్టించిన బిత్తిరి సత్తి అనే పేరును బయట ఎక్కడ వాడుకోవద్దని రవి గట్టి వార్నింగ్ ఇచ్చారట వీ6 యాజమాన్యం. నేటి నుంచి టీవి9లో కనిపించే రవి ఏ గెటప్ లో కనిపిస్తాడో చూడాలి మరి.

- Advertisement -