నన్ను ఎందుకు పక్కన పెట్టారు..వీహెచ్ ఆవేదన

16
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ హన్మంతరావు తన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వీహెచ్‌..తనను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం తన కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్లు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.

పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని తెలిపిన వీహెచ్‌..ఈసారి ఎంపీగా పోటీ చేసి తీరుతానని చెప్పారు. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నానని…తనలాంటి సీనియర్లకు కాకుండా కొత్తగా వచ్చిన వారికి సీటు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు.

గతంలో కూడా తనకు అన్యాయం జరిగిందని…ఈసారి జరిగితే మాత్రం ఊరుకోనని తెగేసి చెప్పారు.

Also Read:కుప్పంలో చంద్రబాబును ఢీ కొట్టేది.. అతనే?

- Advertisement -