ఉత్తర’కు మంచి రెస్పాన్స్..!

511
Karronya Uttara
- Advertisement -

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఉత్తరకు రెస్సాన్ బాగుంది. మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు వస్తున్న స్పందనను మీడియాతో పంచుకుంది చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా దర్శకుడు తిరుపతి యస్ ఆర్ మాట్లుడుతూ: ఉత్తరకు మంచి రెస్పాన్స్ వస్తుంది. చూసిన ప్రేక్షకులు నుండి వస్తున్న ఫీడ్ బ్యాక్ మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. సినిమా పబ్లిసిటీ, రిలీజ్ విషయాల్లో కొందరి వ్యక్తులను నమ్మి మోసపోయాను ఆ విషయంలో బాధ పడుతున్నాను. మా సినిమాకు రెస్పాన్స్ బాగున్నా థియేటర్స్ విషయంలో పోరాటం చేయాల్సి వస్తుంది. వరంగల్, కరీంనగర్ లలో థియేటర్స్ పెరుగుతున్నాయి. సినిమా నిర్మాణంలో రిలీజ్ అనేది చిన్న సినిమాలకు పెద్ద యుద్దం గా మారింది. ఈ పోరాటంలో ఇండస్ట్రీ లోని కొందరి మనుషుల నిజ స్వరూపాలు చూసాను, మంచి సినిమాలను బ్రతికించాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకూ మా సినిమా ఇంతలా రీచ్ అయ్యిందంటే కారణం మీడయానే.. మాకు సహాకరించిన వారికి ధన్యవాదాలు ’అన్నారు.

Uttara movie success meet

హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ: నిన్న శుక్రవారం విడుదలైన మా ఉత్తరకు చాలా మంచి స్పందన వస్తుంది. నేను ప్రేక్షకులతో ఈ సినిమాను చూసాను అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడింది విని చాలామందికి వచ్చిన సందేహాలను సినిమా తీర్చింది. నా నటన, హీరోయిన్ నటన బాగుందని సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక తెలంగాణా బ్యాక్ డ్రాప్ వచ్చిన సహాజమైన ప్రేమకథ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అన్నారు.

హీరోయిన్ కారుణ్య కత్రేన్ మాట్లాడుతూ: ఈ సినిమా విషయంలో నేను ముగ్గురు కు థ్యాంక్స్ చెప్పాలి.. ఒకరు మా డైరెక్టర్ తిరుపతి యస్ ఆర్. స్వాతి లాంటి మంచి పాత్రను నాకు ఇచ్చినందకు, రెండు మీడియాకి మాసినిమాను ఇంతవరకూ సపోర్ట్ చేసినందుకు, మీడియా ఇచ్చిన ప్రోత్సాహంతోనే మా సినిమా ప్రేక్షకులకు తెలిసింది. మూడు ప్రేక్షకులకు సినిమా రిలీజ్ తర్వాత నాకు వస్తున్న రెస్పాన్స్ చాలా బాగుంది. స్వాతి, అశోక్ ల ప్రేమకథ అందరికీ నచ్చుతుంది. స్వాతి పాత్ర నాకు చాలా సంతృప్తి నిచ్చింది ’ అన్నారు.

- Advertisement -