- Advertisement -
ఉత్తరప్రదేశ్‌లో ఓ కిలాడి లేడి చేసిన పని ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు 7 నెలల్లో 25 మందిని పెళ్లి చేసుకుంది యువతి. పదుల సంఖ్యలో యువకులను మోసం చేసింది ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ ప్రాంతానికి చెందిన అనురాధ.
ఇంట్లో గొడవలతో భర్తతో విడిపోయి..ఆ తర్వాత పెళ్లి పేరుతో మోసాలు చేసే ఏజెంట్లతో చేతులు కలిపింది అనురాధ. ముఠాలుగా ఏర్పడి అనురాధను పెళ్లికూతురుగా పరిచయం చేసేవారు.. పెళ్లి తర్వాత జంప్.
ఓ ముఠా కొత్త పెళ్లి వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటే..మరో ముఠా పెళ్లి తర్వాత జంపింగ్ ఏర్పాట్లు చేస్తూ ఉండేది. ఇలా 7 నెలల్లో 25 పెళ్లిళ్లు చేసుకొని కొటి రూపాయల వరకు కొట్టేసింది ముఠా. రాజస్తాన్ మాధోపూర్ ప్రాంతానికి చెందిన శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వ్యవహారం బయటకు వచ్చింది.
Also Read:TTD:22న హనుమజ్జయంతి వేడుకలు
- Advertisement -

