ఈరోజు సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి,నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంబరాలు వికారంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం. తెలంగాణ ప్రభుత్వం సాండ్ ల్యాండ్, మైన్స్ ,వైన్స్ లక్ష్యంగా పాలన సాగిస్తుంది. టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో దోచుకో దాచుకో అన్న చందంగా మారిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితమే దేశ అభివృద్ధి అన్నారు. బీజేపీ మాదిరిగా దేశాన్ని రెండుగా విభజించి పాలించడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని అన్నారు.
గీతారెడ్డి మాట్లాడుతూ.. కన్నీళ్ల రాష్ట్రంగా తెలంగాణ మారింది.. రాష్ట్రాన్ని కెసిఆర్ ఒక్కడే తేలేదు ఎందరో అమరుల త్యాగ ఫలం సోనియాగాంధీ కృషి వల్లనే తెలంగాణ వచ్చింది. సూర్యాపేట కాంగ్రెస్ సభ్యత్వనమోదు దేశంలోనే ఆదర్శంగా ఉంది. కాంగ్రెస్ విజయాన్ని మోడీ కేసీఆర్ ఆపలేరు. దేశ భవిష్యత్తు కాంగ్రెస్ కార్యకర్తల చేతుల్లో ఉంది. జీవో 317 ను కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని తెలిపారు.