ఆ భయంతోనే ఉత్తమ్ కు ఛాన్స్?

65
- Advertisement -

టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వీడే అవకాశం ఉందని, ఆయన అధికార బి‌ఆర్‌ఎస్ లో చేరడానికి సిద్దమౌతున్నారని గత కొన్నాళ్లుగా పోలిటికల్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి విధితమే. ఆయన కూడా ఆ మద్య పార్టీకి సంబంధించిన వ్యవహారాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దాంతో ఆయన పార్టీ విడతారనే వార్తలు జోరందుకున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉంటూ వస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవి చేపట్టిన తరువాత తీవ్రంగా వ్యతిరేకిస్తూ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. .

అయితే ఆ మద్య ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పారు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వంటి వారు సైతం రేవంత్ నాయకత్వంపై వ్యతిరేకత చూపుతూ వచ్చారు. కానీ కర్నాటక ఎన్నికల్లో లభించిన విజయం తరువాత సీన్ రివర్స్ అయింది భట్టి విక్రమార్క తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా యాక్టివ్ అవుతూ రేవంత్ నాయకత్వానికి మద్దతు పలుకుతున్నారు. అంతే కాకుండా ఆయా కీలక పదవుల్లో కూడా వారికి స్థానం కల్పించింది అధిష్టానం. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మాత్రం ఎలాంటి బాధ్యత అప్పగించలేదు.

దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ వీడడం ఖాయమనే ఊహాగానాలు వచ్చాయి. ఉత్తమ్ అసంతృప్తిని గ్రహించిన హస్తం హైకమాండ్ ఆయనకు ఇటీవల ఏర్పాటు చేసిన స్క్రినింగ్ కమిటీలో చోటు కల్పించింది. దీంతో ఉత్తమ్ ను బుజ్జగించేందుకే అధిష్టానం స్థానం కల్పించిందనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. అది కాకుండా నల్గొండ జిల్లా ఎంతో కొంత ఉత్తమ్ కుమార్ ప్రభావం గట్టిగానే ఉంటుంది. కాబట్టి ఆయన ఏ మాత్రం పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగువవేసిన పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని భావించిన అధిష్టానం.. ఉత్తమ్ కు స్క్రినింగ్ కమిటీలో స్థానం కల్పించిందనే చెప్పవచ్చు.

Also Read:పవన్ నెత్తిన మరొకటి.. పరిస్థితి ఏమిటి ?

- Advertisement -