మొక్కలు నాటిన ఐఎఎస్ అధికారి ఉత్సవ్..

233
Utsav Gautam IAS
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం యువ ఐఏఎస్ అధికారులలో చైతన్యాన్ని తీసుకు వస్తుంది. ఈ చాలెంజ్‌లో భాగంగా యువ ఐఏఎస్ లు గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని తమ ట్రైనింగ్ బ్యాచ్ మిత్రులకు ఛాలెంజ్ ఇవ్వటం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ‌యువ ఐఏఎస్ అధికారి అభిలాష ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఉత్సవ్ గౌతమ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం చేపట్టి రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన ఈ చాలెంజ్‌లో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ చాలెంజ్ ఇదే విధంగా కొనసాగాలని అందులో భాగంగా నా ఐఏఎస్ బ్యాచ్ మిత్రులు అభినాష్ మిశ్రా, ఉత్సాహ చౌదరి, హిమాన్ష్ కౌశిక్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -