బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 21 హైలైట్స్

146
kumar sai

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 21 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకుంది. వీకెండ్ కావడంతో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇవ్వగా ఈ వారం హౌస్‌ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇవాళ చెప్పనున్నారు. తొలుత ఎస్పీ బాలసుబ్రమణ్యంకు నివాళి అర్పించిన నాగార్జున… శుక్రవారం హౌస్‌లో ఏం జరిగిందో చూపించారు.

తర్వాత ఇంటి సభ్యులకు నాగార్జున ట్రూత్ టవర్ గేమ్ పెట్టారు. నాగార్జున పిలిచినవారు వచ్చి సమాధానాలు చెప్పాలి. దీంతో తొలుత వచ్చిన కుమార్ సాయి…అభిజిత్‌పై ఆరోపణలు చేశాడు. తనను లూజ్‌ అని అమర్యాదగా అన్నారని కుమార్ సాయి ఎమోషనల్ అయ్యాడు. దీంతో తాను మాట్లాడిన మాటలు తప్పయితే సారీ అభిజిత్ చెప్పడంతో కుమార్ సాయి థాంక్యూ చెప్పాడు.

ఇక ఈవారం హౌస్‌లో ముగ్గురుకి మూడు మెడల్స్ వేశారు నాగార్జున. లాస్యతో స్టోర్ రూంలో ఉన్న మెడల్స్ తెప్పించారు. ఒక్కో మెడల్‌పై మహానటి,మహాకంత్రి, మహానాయకుడు అని రాసున్నాయి. తన జట్టును గెలిపించిన అభిజిత్‌కు మహానాయకుడు మెడల్, ఇక మహాకంత్రి మెడల్‌ను అమ్మ రాజశేఖర్ అవినాష్‌కు వేయగా మహానటి మెడల్‌ను గంగవ్వకు వేశారు.

లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగినప్పుడు గంగవ్వ తెలివిగా అఖిల్‌ను బోల్తా కొట్టించిన వీడియోను నాగార్జున చూపించారు. ఈ వీడియో చూసి అంతా షాకయ్యారు.లోపల అభిజిత్‌తో ప్లాన్ చేసి బయటకు వచ్చి అఖిల్ వద్ద గంగవ్వ నటించిన తీరు అమోఘం. దివిని కిడ్నాప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించిన మహానటి అని కొనియాడారు నాగ్.

తర్వాత ఇంటి సభ్యులతో మాస్క్ గేమ్ ఆడించిన నాగ్‌…ఒక్క సభ్యుడు ఒక్కో మాస్క్ తీసుకొని నాగ్ చెప్పే వ్యక్తి ముందు ఉంచి చెడు క్వాలిటిస్ చెప్పాలన్నారు. మోనాల్ – అఖిల్‌: అఖిల్ చిన్న చిన్న విషయాలకు అప్‌సెట్ అవుతున్నాడని, కోప్పడతాడని మోనాల్ చెప్పింది. నోయల్ – అమ్మ రాజశేఖర్: మాస్టర్ చాలా కుల్లు జోకులు వేస్తున్నారని….కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లాడు అయిపోతారని తెలిపారు. ఎమోషన్ అవుతారని నోయల్ చెప్పారు.

దివి – అభిజిత్: అతను చాలా అమాయకుడు అని అనుకున్నా కానీ బయటికి కనిపించేంత సాఫ్ట్ ఏమీ కాదని లోపల చాలా ఉందని అభిజిత్ గురించి దివి తెలపగా దేవి – గంగవ్వ: ఎవరినైతే ఇష్టపడుతుందో వారి తప్పు ఉన్నా వారినే గంగవ్వ సపోర్ట్ చేస్తుందని తెలిపింది దేవి. అవినాష్ – లాస్య: ఇంట్లో ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడిపోతుందని అది లాస్య బ్యాడ్ క్వాలిటీ అని చెప్పాడు.

సుజాత – అభిజిత్: అందరితోనూ కలవట్లేదు అనే బ్యాడ్ క్వాలిటీ అభిజిత్‌లో కనిపిస్తుందని సుజాత తెలపగా గంగవ్వ – హారిక: మొహం కడగకుండానే హారిక కాఫీ తాగుతుందని గంగవ్వ తెలిపింది. రాజశేఖర్ – దివి: దేనికి ఏడ్వాలో దేనికి నవ్వాలో దివికి తెలీదని అమ్మ రాజశేఖర్ చెప్పగా లాస్య – స్వాతి:ఎవరితో క్లోజ్‌గా ఉండాలో స్వాతి ముందుగానే ఫిక్స్ అయ్యి వచ్చిందని తెలిపింది.

ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న ఏడుగుర మెహబూబ్, మోనాల్, కుమార్ సాయి, లాస్య, దేవి, అరియానా, హారికలలో లాస్య, మోనాల్‌ సేవ్ అయినట్లు ప్రకటించిన నాగ్ ఇంటినుండి ఎవరు బయటకు రానున్నారో ఇవాళ చెబుతానని తెలిపారు.