ఏపీ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుటీఎఫ్ గెలుపు..

597
utf
- Advertisement -

ఏపీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుటీఎఫ్ గెలుపొందింది. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సాబ్జీ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే షేక్ సాబ్జీ విజయం సాధించారు.

షేక్‌ సాబ్జీకి 7,983 ఓట్లు పోలవగా.. నారాయణరావుకు 6,446 ఓట్లు వచ్చాయి.దీంతో తన ప్రత్యర్ధి గంథం నారాయణరావు మీద 1537 ఆధిక్యంతో షేక్ సాబ్జీ విజయం సాదించారు. ఇది ఉపాధ్యాయుల సమిష్టి విజయం, అని ఉపాధ్యాయుల సమస్యలపై చట్టసభలో గళమెత్తి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పేర్కొన్నారు.

11 మంది అభ్యర్థులు పోటీ పడినా షేక్ సాబ్జీకి పీఆర్‌టీయు మద్దతిచ్చిన గంధం నారాయణరావు మధ్య ప్రధానంగా పొటీ నెలకొనగా బలమైన ఉపాధ్యాయ సంఘంగా ఉన్న యూటీఎఫ్ మద్దతుతో షేక్ సాబ్జీ గెలుపొందారు.

- Advertisement -